మలయాళ సినిమా చరిత్రలోనే అత్యధిక ప్రజాదరణ, వ్యూస్ పొందిన పాట జిమ్మిక్కి కమ్మల్. ఇది సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన వెళిపడింతె పుస్తకం చిత్రం లోనిది. 80 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చిన ఈ పాటను ఇప్పుడు యూ ట్యూబ్ నుండి తొలగించారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు షాన్ రెహమాన్ తన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు.
కాపీరైట్ కారణాల వల్ల యూట్యూబ్ వారు ఈ పాటను తొలగించారని ఆయన తెలిపారు. ఈ సినిమాను కొనుక్కున్నవారు, అమ్మినవారు కూడా చిత్ర పరిశ్రమకు చెందినవారే. ఇది కేవలం ఓ బిజినెస్ డీల్. యావత్ ప్రపంచం ఈ పాటను భాషా బేధాలు లేకుండా ఇష్ట పడింది, డాన్సులు చేసింది. పాట విలువను తెలుసుకోకుండా దానిని మలయాళీలే అమ్మేస్తే వారిని ఏమనాలో అర్థంకావడంలేదు. అని ఆయన బాధను వ్యక్తం చేసారు.
Post a Comment