మయన్మార్ సరిహద్దు మారలేదు

మయన్మార్ సరిహద్దు మారలేదు
మయన్మార్ కు మన దేశానికి మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దును మార్చలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేసారు. ఈ మధ్య సర్వే నిర్వహించిన సమయంలో మన దేశం మయన్మార్ కు కొంత భూమిని ఇచ్చినట్లు మీడియా లో వస్తున్న వార్తలను ఖండించారు. స్తంభాలను వాటి ప్రదేశం లోంచి మార్చలేదని, అసలు సరిహద్దు విషయంలో ఎటువంటి వివాదం గానీ, గందరగోళం గానీ లేదని వివరణ ఇచ్చారు. 

1967 నాటి భారత-మయన్మార్ సరిహద్దు ఒప్పందం ప్రకారమే  ద్వైపాక్షిక సర్వే నిర్వహించామని ప్రతినిధి వివరించారు. ఈ సర్వే ప్రతి కొన్ని రోజులకు ఒకసారి రెండు దేశాలు కలిసి నిర్వహించే సాధారణ సర్వే మాత్రమేనని, 81 మరియు 82 లైన్ల మధ్య ఉన్న సరిహద్దును పటిష్ట పరిచేందుకు నిర్వహించామని వెల్లడించారు. 

0/Post a Comment/Comments