తెలుగు దేశం పార్టీ పై జేసీ దివాకర్ రెడ్డి అలిగారు. శుక్రంవారం రోజు జరిగే అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా తాను పార్లమెంటుకు హాజరవటం లేదని తెలియజేసారు. పార్లమెంట్ సభ్యులకు తెదేపా జారీ చేసిన విప్ తో తనకు నష్టమేంలేదన్నారు. పార్లమెంట్‌లో తీర్మానంపై మాట్లాడేందుకు తనకంటే సమర్థులు, ఇంగ్లిష్‌పై ప్రావీణ్యం ఉన్నవారు మరియు అనుభవజ్ఞులు ఉన్నారని తెలిపారు. అక్కడ ఏ ఇద్దరికో, ముగ్గురికో మాట్లాడే అవకాశం వస్తుందని తాను ఉన్నా లేకపోయినా తేడా ఏం ఉండదని అన్నారు. అయితే ఆయన పార్టీ అధ్యక్ష్యుడు చంద్రబాబు నాయుడు, ఎంపీ సుజనా చౌదరిలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు, రాజీనామా చేసే ఉద్దేశ్యంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టిడిపి ఎంపీలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
సుజనా చౌదరితో తనకు విభేదాలేమీ లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు. సుజనా నాకు మంచి మిత్రుడు. ఆయనపై నేనేమీ అలగలేదు. నేను ప్రస్తుత రాజకీయాలలో ఇమడలేనని, నాకు నేను పనికిరానని అనిపిస్తోంది. అందుకే పార్లమెంటుకి వెళ్లడం లేదు. దేశంలో, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం అసలు బాగా లేదని జేసీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు వల్లే సాధ్యమని, నేనెందుకు పార్టీ మారతానని ముక్తాయించారు.
Post a Comment