రష్యన్ యుద్ధ నౌక, దిమిత్రి డన్‌స్కోయ్ శిథిలాలను దక్షిణ కొరియాలోని ఉల్లంగాడో ద్వీపంలో కొందరు డైవర్స్ కనుగొన్నారు. ఈ నౌక 1905 లో జపాన్ యుద్ధనౌకతో జరిగిన యుద్ధంలో మునిగిపోయింది. ఆ యుద్ధనౌకలో మునిగిపోయే సమయానికి 5500 పెట్టెల బంగారం ఉంది. దాని విలువ ఇప్పటి మన కరెన్సీ ప్రకారం 10 లక్షల కోట్లు.
దక్షిణ కొరియా, చైనా, బ్రిటన్, కెనడా దేశాలకు చెందిన కొంతమంది సభ్యుల బృందం గత కొన్ని సంవత్సరాలుగా, నౌక మునిగిన ప్రాంతంలో అన్వేషణ జరుపుతోంది. ఎట్టకేలకు దాన్ని 430 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో కనుగొన్నారు.
అన్వేషణ జరుపుతున్న షినిల్ బృందం అన్వేషణకు సంబంధించిన ఫుటేజ్ ను యూట్యూబ్ లో విడుదల చేసింది. ఆ నౌక దిమిత్రి డన్‌స్కోయ్ అని నిర్ధారించారు. దానిలో కొన్ని బాక్సులు ఉన్న విషయం కూడా ధృవపడింది. నవంబర్ నాటికి అందులోని బాక్సులను పైకి తేనున్నారు. అయితే ఇప్పటికే దక్షిణ కొరియా, రష్యాల మధ్య బంగారం వాటాల విషయంలో గొడవ మొదలైంది.
Post a Comment