జనసేన ఇప్పటికీ బిజెపికి మిత్రపక్షమే అని యనమల రామకృష్ణుడు అన్నారు. ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చామని తెలుగు దేశం పార్టీ ప్రకటించిందని, జనసేన ఇంకా ప్రకటించలేదు కాబట్టి ఎన్డీఏలోనే ఉందని ఆయన తేల్చేసారు. జనసేన తో కలిసి పోటీ చేస్తామని వామపక్ష పార్టీలు ప్రకటిస్తున్నా పవన్ స్పందించట్లేదు అని అన్నారు.
రాజ్యాంగానికి కనీసం ఐదు సవరణలు జరిగితే తప్ప జమిలి ఎన్నికల విధానం అమల్లోకి రాదన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో మైనార్టీలో ఉన్న మోడీ ప్రభుత్వం ఆ సవరణలు చేసే పరిస్థితిలో లేదన్నారు. జమిలి ఎన్నికల వల్ల రాష్ట్రాల అజెండా ప్రజల్లోకి వెళ్లదని, ఇది ప్రాంతీయ పార్టీలను అణగదొక్కేందుకే బీజేపీ ముందుకు తెచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవి దేశహితం కోసం కాదని, కేవలం మోదీ అమిత్‌షాల హితం కోసమేనన్నారు. ఇక రాష్ట్రంలో అవినీతి లేదు కాబట్టే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి స్థానంలో నిలిచిందని ముక్తాయించారు.
Post a Comment