విమానాశ్రయం నుండే బ్రిటన్ ఎంపీ డిపోర్ట్

విమానాశ్రయం నుండే బ్రిటన్ ఎంపీ డిపోర్ట్
మనదేశంలో బ్రిటన్ ఎంపీ లార్డ్‌ అలెగ్జాండర్‌ కార్లిలేకు  చేదు అనుభవం ఎదురైంది. సరైన వీసా పత్రాలు లేనందుకు ఆయనను అధికారులు, ఢిల్లీ విమానాశ్రయం నుండి  వెనక్కి పంపించారు. 

అలెగ్జాండర్‌ కార్లిలే, భారత్ వ్యతిరేకి అయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియాకు న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.  ఖలీదా జియా పైన ప్రస్తుత ప్రభుత్వం 36 క్రిమినల్ కేసులను దాఖలు చేసింది. వాటిలో ఒకదానిలో ఆమెకు 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆమె కుటుంబ సభ్యులు, ఈ కేసులను మళ్ళీ ఖలీదా ప్రధానమంత్రి కాకుండా చేయడానికి కుట్రగా అభివర్ణించారు. 

అలెగ్జాండర్‌ కార్లిలే, బంగ్లాదేశ్ కు వెళ్లి అక్కడ అంతర్జాతీయ మీడియా ముందు ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎండగట్టాలని భావించారు. అయితే అక్కడి ప్రభుత్వం ఆయనకు ప్రవేశాన్ని నిరాకరించింది. దానితో ఆయన మనదేశం వచ్చి ఇక్కడ న్యూ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఆయనకు ఇక్కడ కూడా అదే అనుభవం ఎదురైంది. కార్లిలే వీసా వివరాలతో  ప్రస్తుత పర్యటన వివరాలు సరిపోలనందున ఆయనను భారత్‌లోకి అనుమతించలేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌  వెల్లడించారు. 

బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా వాజెద్ భారత్ అనుకూల వ్యక్తి . అందువల్ల అక్కడి ప్రభుత్వాన్ని సంతోష పరిచేందుకే ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. మన దేశం స్వప్రయోజనాల కోసం అవసరమైతే పాశ్చాత్య దేశాలకు దృఢమైన సమాధానం చెప్పగలదని ఈ ఘటన రుజువు చేసింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post