24న రాష్ట్ర బంద్‌కు జగన్ పిలుపు

ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పిన తరువాత రాష్ట్రం రాజకీయంగా వేడెక్కే పరిస్థితి కనిపిస్తుంది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్లమెంట్లో వివిధ పార్టీలు అనుసరించిన వైఖరి పట్ల రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏ పార్టీకి కూడా ప్రత్యేక హోదా విషయం అసలు పట్టనే లేదని ఆయన అన్నారు. బిజెపి ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పగా, కాంగ్రెస్ అధినేత ఆంధ్రప్రదేశ్ గురించి కనీసం ఒక నిమిషం పాటు కూడా ప్రస్తావించలేకపోయారని దుయ్యబట్టారు. 

ప్రత్యేక హోదా సాధించే పోరాటాన్ని ముమ్మరం చేయడంలో భాగంగా ఈ నెల 24వ తేదీన అంటే మంగళవారం రోజు రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. మన నిరసన కేంద్రానికి వినిపడేలాగ అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా దీనికోసం కలసి రావాలని ఆయన విజ్ఞప్తి చేసారు. 

చంద్రబాబు చివరి అస్త్రంగా అవిశ్వాసం ప్రవేశ పెట్టానని చెప్పారని, అస్త్రాలు, సమయం అయిపోయాక ఇంకా పోరాటం చేస్తా అని మభ్యపెట్టాలని చూస్తున్నాడని జగన్ ఆరోపించారు.  ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజికి అంగీకరించి, రాష్ట్ర హక్కును తాకట్టు పెట్టడానికి సీఎం చంద్రబాబుకు ఏం హక్కుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post