ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన 2017 సవరించిన అంచనాల ప్రకారం ఇప్పుడు భారత్ ప్రపంచం లో ఆరవ పెద్ద ఆర్థిక వ్యవస్థ గా అవతరించింది. ఈ క్రమం లో ఫ్రాన్స్ ను అధిగమించి ఇప్పుడు ఆరవ స్థానానికి చేరుకుంది. తొలి స్థానంలో అమెరికా ఉండగా, చైనా, జపాన్, జర్మనీ, యూకే లు కూడా మనకన్నా ముందే ఉన్నాయి.
ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం గత ఏడాది మన దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 2.597 ట్రిలియన్ డాలర్లు. కాగా ఫ్రాన్స్ జిడిపి 2.582 ట్రిలియన్ డాలర్లు. యూకే మనకన్నా కొంచం ముందు అంటే 2.622 ట్రిలియన్ డాలర్లతో ఉంది. ఈ ఏడాది మన దేశం 7.4 శాతం వృద్ధిని సాధించనుందనే అంచనాలుండటంతో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సంవత్సరాంతం వరకు మనదేశం అయిదవ స్థానాన్ని, 2032 వరకు మూడవ స్థానాన్ని సాధిస్తుందనే అంచనాలున్నాయి.
Post a Comment