భారీ వర్షాలకు ముంబైలోని సబర్బన్ రైల్వే ట్రాక్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. హార్బర్ సబర్బన్ మార్గంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో, రైల్వే సిబ్బంది గుడ్డ ముక్కను దానికి కట్టారు. రైల్వే ఉద్యోగులు దెబ్బతిన్న పట్టాలకు గుడ్డ ముక్కను కడుతున్న, తర్వాత దానిపై రైలు వెళుతున్న దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అవుతోంది. ముంబై టీవీ ఛానెల్స్ కూడా ఈ విషయాన్ని హైలైట్ చేసాయి. దీంతో అనేక మంది రైల్వే పై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
ఈ సంఘటన పై రైల్వే శాఖ వివరణ ఇచ్చింది. అక్కడ ఫిష్ ప్లేట్ దెబ్బతినలేదని, వర్షంలో పెయింట్ నిలవదు కనుక భవిష్యత్ లో మరమత్తు కోసం గుర్తుగా గుడ్డ ముక్క చుట్టారని తెలిపింది. కాగా ముంబై వాసులు వివరణతో సంతృప్తి చెందక ఇంకా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
Post a Comment