కొనప్పన అగ్రహారా (ఎలెక్ట్రానిక్ సిటీ) మెట్రో స్టేషన్ నిర్మాణం కోసం బెంగళూరు మెట్రో కు 200 కోట్ల రూపాయలు చెల్లించడానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తో ఈ నెల 19 న ఒప్పందంపై సంతకం చేయనున్నారు.
ఈ విషయమై ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ సుధా మూర్తి గారితో, తన నివాసం లో చర్చించినట్లు ముఖ్యమంత్రి కుమార స్వామి వెల్లడించారు.
ఎంబసీ గ్రూప్, ప్రెస్టీజ్ గ్రూప్, ఇంటెల్ వంటి కంపెనీలు ఇప్పటికే సిల్క్ బోర్డు - కేఆర్ పురం విభాగంలో తలా 100 కోట్ల రూపాయల నిధులు సమకూర్చేందుకు ఎంఓయుపై సంతకాలు చేసాయి. ఔటర్ రింగ్ రోడ్డులోని హబ్బాగోడీ మెట్రో స్టేషన్ కోసం బయోకాన్ సిఎండి కిరణ్ మజుందార్ షా కూడా 100 కోట్ల నిధులను సమకూర్చారు.
Post a Comment