లోకేష్ లా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు రాజకీయాలలోకి రాలేదు.

లోకేష్ లా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు రాజకీయాలలోకి రాలేదు.
రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయని, దోపిడీదారులు, ఫ్యాక్షనిస్టులు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారని, మార్పు కోసమే తాను రాజకీయాలలోకి వచ్చానని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని ఫంక్షన్‌హాలులో పార్టీ అభిమానులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అన్నారు.  తన లాంటి మూడో పక్షం రావడం వల్లే ఉద్ధానం, ఉండవల్లి లాంటి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయని కూడా తెలిపారు. 

మంత్రి లోకేష్ స్వార్థంతో ఆలోచిస్తారని, ఏ పనికి ఎంత వస్తుందనే  లెక్కలు వేసిన తర్వాతే  ఆయన అడుగేస్తారని పవన్ వ్యాఖ్యానించారు. తాను లోకేష్ లా అన్నీ అనుకూలంగా ఉండి రాజకీయాల్లోకి రాలేదని, రావాలని నిర్ణయించుకున్న తర్వాత తనకు ధైర్యం కూడగట్టుకోవటానికి పదేళ్లు పట్టిందని తెలిపారు. మాట మాట్లాడితే తెలంగాణ వాళ్లకి కోపం, ఊరుకుంటే ఆంధ్ర ప్రజలు తిట్టే క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చానని కూడా అన్నారు. 

ముఖ్య మంత్రి కొడుకే ముఖ్య మంత్రి కావాలా? సామాన్యులు కాకూడదా అని ప్రశ్నించారు. కొత్త తరానికి మంచి బాధ్యత తో కూడిన వ్యవస్థను అందించే ఉద్దేశ్యంతోనే రాజకీయాలలోకి వచ్చానని, మరో ఇరవై ఐదేళ్ల పాటు రాజకీయాలలో ఉంటానని పవన్ వివరించారు. ప్రతిపక్ష నాయకుడు జగన్లా నేను కూడా తిట్టగలను, నాది కూడా బలమైన నోరే, కానీ గొడవలు పరిష్కారం కాదని ఆయన అన్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post