26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్, పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలలో భారీ సంఖ్యలో అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయాడు.
హఫీజ్ సయీద్ కు చెందిన రాజకీయ పార్టీ అయిన మిల్లీ ముస్లిమ్ లీగ్ ను అక్కడి ఎన్నికల కమిషన్ గుర్తించటానికి నిరాకరించటంతో ఆయన అల్లాహ్-ఓ-అక్బర్ తెహ్రీక్ పార్టీ తరపున అభ్యర్థులను నిలిపారు. ఆయన మొత్తం 264 మంది అభ్యర్థులను, వారిలో 80 మందిని జాతీయ అసెంబ్లీకి, మిగిలినవారిని స్థానికంగా పోటీలో నిలిపారు.
ఈ ఎన్నికలలో హఫీజ్ సయీద్ స్వయంగా పోటీ పడలేదు. కానీ ఓడిపోయిన అభ్యర్థులలో అతని కుమారుడు, అల్లుడు ఉన్నారు.
Post a Comment