తెలంగాణాలో ఎయిమ్స్

తెలంగాణాలో ఎయిమ్స్

బీబీ నగర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS ) ఏర్పాటు చేయటానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గురువారం రోజు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాన మంత్రి స్వస్థ్య సురక్షా యోజన (PMSSY) డైరెక్టర్ సంజయ్ రాయ్, తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శి శాంతి కుమారికి లేఖను పంపించారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిన ఆసుపత్రి భవనంతో పాటు, ఎటువంటి వివాదాలు, ఆక్రమణలు లేని మరో 49 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించవలసిందిగా లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా మౌలిక వసతులైన నాలుగు లైన్ల రోడ్డు వేయటం, 1.5MLD ల నీటి సరఫరాను ఏర్పాటు చేయటం, 20MVA  విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకించి 33/11 KV సామర్థ్యంతో ఒక సబ్ స్టేషన్ మరియు అదనంగా మరొక ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయవలసి ఉంటుందని తెలియచేసారు. 

0/Post a Comment/Comments