జైలు నుండి హెలికాప్టర్‌లో తప్పించుకున్న దొంగ

జైలు నుండి హెలికాప్టర్‌లో పారిపోయిన దొంగ
పారిస్ లోని ఒక జైలు నుండి దోపిడీ దొంగ హెలికాప్టర్‌లో తప్పించుకుని పారిపోయాడు. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. 

రెడైన్ ఫెయిద్‌ అనే  దొంగ కు, ఒక దోపిడీలో పోలీసు అధికారిని చంపడంతో 25 సంవత్సరాల జైలుశిక్ష పడింది. దీనితో అతని సహచరులు అతన్ని తప్పించడానికి హెలికాప్టర్‌ను హైజాక్ చేసి, జైల్లో ల్యాండ్ చేసి మరీ అతన్ని తీసికెళ్లారు. ఆ సమయంలో జైలు ముందు కొంతమందితో వారు పెద్ద గందరగోళం సృష్టించటంతో, జైలు సిబ్బంది అతను తప్పించుకోవడాన్ని గమనించలేకపోయారు.  అతనితో పాటు జైల్లోని మరో ముగ్గురు కూడా తప్పించుకోవడం విశేషం. 

గతంలో కూడా ఇతను జైలు నుండి ఒకసారి తప్పించుకున్నాడు. రెడైన్ ఫెయిద్‌ గతంలో పలు టీవీ ప్రదర్శనలు ఇచ్చాడు. అలాగే రెండు పుస్తకాలకు సహ రచయితగా కూడా వ్యవహరించాడు. 

0/Post a Comment/Comments