సికింద్రాబాద్ నుండి అజహర్ పోటీ?

సికింద్రాబాద్ నుండి అజహర్ పోటీ?
గత రెండు లోక్ సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ల నుండి పోటీ చేసిన కాంగ్రెస్ నేత, మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ 2019 లో సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలియచేసారు. ఎక్కడ నుండి పోటీ చేస్తాను అనే విషయం కాంగ్రెస్ అధిష్ఠానం చూసుకుంటుందని, కానీ తన ఉద్దేశ్యాన్ని మాత్రం వారికి తెలియ పర్చానని ఆయన అన్నారు. 

పిటిఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అజహర్ మాట్లాడుతూ ఇంతకు ముందు మొరాదాబాద్ నుంచి టోంక్ కు మారడంపై స్పందిస్తూ, తాను డిఫెన్స్ ఆడటాన్ని ఇష్టపడే వ్యక్తిని కాదని చమత్కరించాడు. స్వంత రాష్ట్రం నుండి పోటీచేయాలని చాలామంది ప్రజలు నాతో అంటున్నారని, అందుకే సికింద్రాబాద్ నుండి పోటీ చేయాలనీ అనుకుంటున్నట్లు ఆయన తెలియచేసారు. 

సికింద్రాబాద్ లో గెలిచే అవకాశాలపై ఆయన మాట్లాడుతూ, నేను ఈ నియోజకవర్గంలో అనేక ప్రాంతాలు పర్యటించాను. దాదాపు అందరూ నన్ను ఆహ్వానించారు. అని అన్నారు. పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం. వారు ఏ నియోజకవర్గం సూచిస్తే నేను అక్కడినుండి పోటీ చేస్తాను అని ఆయన అన్నారు. 

రైతు సమస్యల పట్ల నిర్లక్ష్యం, జిఎస్టీ మరియు నోట్ల రద్దు వలన కలిగిన ఇబ్బందులతో కేంద్ర ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని అజహర్ అభిప్రాయపడ్డారు.

0/Post a Comment/Comments