మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ యువ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిన్న లోక్‌సభలో క్షమాపణలు చెప్పారు.
సింధియా నియోజకవర్గంలో జరిగిన ఒక రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గడ్కరీ హాజరయ్యారు. కానీ, తనను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించలేదని, శిలా ఫలకం పై తన పేరు వేయలేదని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఆ కార్యక్రమానికి స్థానిక ఎంపీని పిలవాలని, ఇది సభ్యుల హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, తనను ఈ విధంగా అవమానించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిపై హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నానని అన్నారు.
దీనిపై కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ, అది దురదృష్టకరమని, ఆ ప్రారంభోత్సవానికి హాజరైనందున తాను ఈ ఘటనకు బాధ్యత వహిస్తానని, అందరి తరపున తను క్షమాపణలు చెపుతున్నానని ఆయన అన్నారు. అయినప్పటికీ సింధియా తన పట్టు వీడకపోవటంతో మల్లికార్జున ఖర్గే ఆయనను సముదాయించారు.
మరో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో కూడా ఎన్నోసార్లు ఇలా జరిగిందని, మంత్రి క్షమాపణలు తెలిపినందున ఈ విషయాన్ని ఇంతటితో వదిలివేయాలని కోరారు.
Post a Comment