నేను అభివృద్ధి కోసం ఎన్డీయేలో .... మీదేమో కుమ్మక్కు, లాలూచీ, అభివృద్ధిని అడ్డుకునే కుట్ర

pavan jagan cbn
నేను రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీయేలో చేరాను. వాళ్ళు మోసం చేసారు. అందుకే బయటకు వచ్చాను. 

జగన్ కేసుల భయంతోనే బిజెపి తో కుమ్మక్కయ్యాడు. 
నేను కేంద్రంతో పోరాడుతుంటే పవన్, జగన్లు ఇద్దరూ కేంద్రంతో లాలూచీ పడి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారు.

ఇవన్నీ నిన్న కొవ్వూరులో జరిగిన  బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు. 

చంద్రబాబు నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, హోదా వద్దు, ప్యాకేజీ కావాలి, హోదా అంటే జైలుకే లాంటి వన్నీ మాట్లాడి ఇప్పుడు ప్రతిపక్షాలకు ఏమాత్రం సంబంధం లేకున్నా వారే బీజేపీ తో కుమ్మక్కయ్యారని ఆరోపించడం ఉందే,  
అది న భూతో... లాంటి వ్యూహం. 
ఇలాంటి వ్యూహాలు చాణక్యుని అర్థశాస్త్రంలో కూడా ఉండవు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post