సంజూ సినిమాకు అబూ సలీమ్ ఝలక్

1993 బాంబు పేలుళ్లపై జీవిత ఖైదు అనుభవిస్తున్న మాఫియా డాన్ అబూ సలీం ఇటీవలే విడుదలై, విజయం సాధించిన సంజూ చిత్ర నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించారు. ఆ చిత్రంలో అతన్ని తప్పుగా చూపించారని, అతని పరువుకు నష్టం కలిగేలా సీన్లు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. 

సంజయ్‌దత్‌కు, అబూ సలీమ్ అక్రమ  ఆయుధాలను సరఫరా చేసినట్లు సంజు సినిమాలో చూపించారు. అయితే అది అబద్దమని,  తను ఎన్నడూ సంజయ్‌దత్‌ను కలవలేదని, ఆయనకు ఆయుధాలు ఇవ్వలేదని అబూ సలీమ్ అన్నారు. 15 రోజుల్లోగా చిత్ర నిర్మాతలు ఆ సీన్లను తొలగించి తనకు క్షమాపణలు చెప్పాలని, తగిన పరిహారం కూడా చెల్లించాలని పేర్కొన్న నోటీసులను విధు వినోద్ చోప్రా, రాజు హిరానీ మరియు ఫాక్స్ స్టార్ స్టూడియోలకు పంపించారు. 

సంజు సినిమాపై ఇప్పటికే సంజయ్ దత్ ను అతి మంచి వాడిగా చూపించడానికే తీసారని, బయోపిక్ లో వాస్తవాలు లేవని అనేక విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. 

0/Post a Comment/Comments

Previous Post Next Post