కాబోయే ముఖ్యమంత్రి లోకేష్

కాబోయే ముఖ్యమంత్రి లోకేష్
మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పీతల సుజాత, తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ ప్రస్తావించారు. అంతే కాకుండా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తారని కూడా వ్యాఖ్యానించారు. గ్రామదర్శిని కార్యక్రమం సందర్భంగా మంత్రులు నారా లోకేష్, పితాని సత్యనారాయణలు కూడా పాల్గొన్న సభలోనే ఆవిడ ఈ విధంగా మాట్లాడారు. ఎంత లోకేష్ బాబును ప్రసన్నం చేసుకోవాలంటే మాత్రం మరీ ఇలా మాట్లాడాలా?

గ్రామదర్శిని సభకు భారీ సంఖ్యలో మహిళలు వచ్చి మంత్రి లోకేష్ కు తమ సమస్యలు విన్నవించుకున్నారు. వీటిలో ఎక్కువ మరుగు దొడ్ల కోసం అర్జీలు ఉండటం విశేషం. అడిగిన వారందరికీ ఇస్తున్నాం, అడగని వారికి కూడా మరుగుదొడ్ల అవసరాన్ని వివరించి మరీ మంజూరు చేసాం అని ఒకవైపు కేంద్రం, 100 % మరుగుదొడ్లు ఉన్నాయి అని మరోవైపు రాష్ట్రం ప్రకటించినా ఇంకా క్షేత్ర స్థాయిలో పరిస్థితి మహిళలు వీటి మంజూరు కోసం అర్జీలు పెట్టుకునే దశలోనే ఉంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post