బీజేపీ ఎంపీ కుమార్తె అరెస్ట్‌

బీజేపీ ఎంపీ కుమార్తె అరెస్ట్‌
అస్సాంపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీఎస్‌సీ) పరీక్షలలో జరిగిన అవకతవకలలో పందొమ్మిది మంది అధికారులను అస్సాం పోలీసులు అరెస్టు చేసారు. వీరిలో ప్రస్తుత బిజెపి ఎంపీ ఆర్‌పీ శర్మ కుమార్తె పల్లవి కూడా ఉండటం విశేషం. 

దిబ్రూగర్‌ పోలీసులు ఏపీఎస్‌సీ కుంభకోణాన్ని విచారిస్తున్నారు. 2016లో అధికారులుగా ఎంపికైన వారి చేతి రాతలు, సమాధాన పత్రాలతో సరిపోలలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్దారించటంతో  ఈ అరెస్టులు జరిగాయి. వీరందరినీ ఉద్యోగంలోంచి తొలగిస్తున్నట్లు ఇప్పటికే అస్సాం ప్రభుత్వం ప్రకటించింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post