ట్రైలర్‌కు బదులు మొత్తం సినిమా అప్‌లోడ్‌ చేసారు

ట్రైలర్‌కు బదులు మొత్తం సినిమా అప్‌లోడ్‌ చేసారు
పొరపాటున ట్రైలర్‌కు బదులు మొత్తం సినిమా అప్‌లోడ్‌ చేసారు. ఈ తప్పిదం చేసింది ఎవరో వ్యక్తులో లేక  చిన్న నిర్మాణ సంస్థో అనుకునేరు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్‌ చేసిన నిర్వాకం ఇది. 

జులై 3వ తేదీన సోనీ సంస్థ తమ యూట్యూబ్ ఛానల్‌లో రెడ్‌ బ్యాండ్‌ అనే సినిమా ట్రైలర్‌కు బదులు పొరపాటున ఖలి ది కిల్లర్‌ అనే 90 నిమిషాల పూర్తి  సినిమాను అప్‌లోడ్‌ చేసేసింది. తర్వాత ఎనిమిది గంటల పాటు సినిమా లైవ్ లో నే ఉంది. సీబీఆర్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌ గమనించి సమాచారం అందించే వరకు వారు తెలుసుకోలేకపోయారు. అప్పటికే ఎంతో మంది ఆ సినిమాను వీక్షించారు. ఇప్పుడు ఆ సినిమాను పెయిడ్ కేటగిరీలో అందుబాటులో ఉంచారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post