ముందుగా టాలీవుడ్, తర్వాత కోలీవుడ్ సెలబ్రిటీలపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఇవాళ ఏకంగా కెసిఆర్ కు తనను నగరం నుండి బహిష్కరించవద్దని విజ్ఞప్తి చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. దీనిలో మీకు సన్నిహితులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారంటూ బాంబు పేల్చింది.
ఫేస్ బుక్ పోస్ట్ ఆమె మాటల్లో " గౌరవనీయులైన కేసీఆర్ సార్, దయ చేసి ప్రత్యుత్తరమివ్వండి. నేనింకా ఎన్ని రోజులు బాధ పడాలి. దీనిలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వారికి డ్రగ్స్ తీసుకునే, హీరోయిన్స్ తో పడుకునే అలవాట్లున్నాయి. నేనా తేనెతుట్టెను కదిలించలేను. ఎందుకంటే నాకు న్యాయం జరగక పోగా, నా ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. నేను సురక్షితంగా లేను. మిమ్మల్ని నేను కలవటం నాకు కష్టమైన పని. మీకు సన్నిహితులైనవారు సెక్స్ మరియు డ్రగ్స్ రాకెట్లో ఉన్నారు. నేను రాజకీయ నాయకుల జోలికి రాను. కానీ ప్లీజ్ సర్, ఈ 'మా' అసోసియేషన్, సినీ పెద్దలు నన్ను శారీరకంగా, మానసికంగా హింసించారు. మీరు తెలంగాణకు తండ్రి మరియు రాజు లాంటి వారు. నా పరిస్థితి దారుణంగా తయారైంది. దయచేసి మీరు అర్థం చేసుకొని నాకు న్యాయం చేయండి. పెద్దలను రక్షించకండి. వారు వేలమందిని అన్యాయం చేస్తారు. ఈ పోస్టును అందుకొండి. నేను నిజాలే చెప్తున్నాను. ప్లీజ్ నన్ను హైదరాబాద్ నుండి బహిష్కరించొద్దు."
Post a Comment