డీఎస్పీ నుండి కానిస్టేబుల్ కు డిమోషన్

డీఎస్పీ నుండి కానిస్టేబుల్ కు డిమోషన్
ప్రముఖ భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్‌, పంజాబ్ పోలీసు శాఖలో  డీఎస్పీగా ఉద్యోగం చేస్తున్న విషయం విదితమే. కాగా ఆవిడ ఉద్యోగంలో చేరే సమయంలో సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవని తేలడంతో ఆమెను డీఎస్పీ పదవి నుండి తొలగించినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఆమె 12వ తరగతి చదువుకు, కావాలనుకుంటే కానిస్టేబుల్ ఉద్యోగం మాత్రమే ఇవ్వగలమని ఆయన తెలియచేసారు. 

హర్మన్‌ప్రీత్‌ కౌర్ మన దేశం తరపున అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబరచడంతో ఆమెకు పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇచ్చి గౌరవించింది. 2017 మార్చ్ 1న ఆమె ఉద్యోగంలో చేరింది. ఆ సమయంలో మీరట్ లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించింది. అయితే పరిశీలనలో అవి నకిలీవని తేలింది. ఆమె క్రికెట్‌ కెరీర్‌కు నష్టం కలగకూడదని ఆమెపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని వారు తెలిపారు. 

అర్జున అవార్డు గ్రహీత అయిన హర్మన్‌ప్రీత్‌ కౌర్, ప్రస్తుతం మన దేశ టీ20 జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తుంది. ఇంగ్లాండ్ లో జరగనున్న కియా సూపర్‌ లీగ్‌లో కూడా పాలుపంచుకోనుంది. 

0/Post a Comment/Comments