పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌పై సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటోలు మార్ఫింగ్ చేసినవని, లైంగిక వేధింపుల ఆరోపణలు అవాస్తవమని పోలీసులు తెలిపారు. ఎంపీని బ్లాక్‌మెయిల్ చేసి లబ్ధి పొందాలని బోయిని సంధ్య, విజిత అనే ఇద్దరు అక్కాచెల్లెల్లు ఈ చర్యలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాక వీరు ఎంపీ ఇంటిలోకి దూసుకెళ్ళటానికి కూడా ప్రయత్నించారని తెలుస్తోంది. వీరిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 420, 292A, 419, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు.
ఎంపీ బాల్క సుమన్‌పై వస్తున్న వస్తున్న వార్తలు అసత్యాలని మంచిర్యాల సీఐ ఎడ్ల మహేష్ అన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాలకు చెందిన బోయిని సంధ్య, ఆమె అక్క విజేతలు గత కొన్ని రోజులుగా ఇలాంటి వేధింపులకు పాల్పడుతూ అక్రమ వసూళ్లు చేస్తున్నారు. అదే రీతిలో బాల్క సుమన్ కూడా తమను వేధిస్తున్నాడంటూ వారు జనవరి 18న కేసు పెట్టారు. దీనిపై విచారించి ఎంపీ సుమన్ ఫేస్ బుక్‌లో పెట్టుకున్న ఫోటోను కాపీ చేసుకొని దాన్ని సంధ్య తన ఫొటోలతో మార్ఫింగ్ చేసిందని తేల్చారు.
Post a Comment