కేంద్రం తప్పుచేస్తే మరి మీరేం చేసారో?

కేంద్రం తప్పు చేస్తే రాష్ట్రాన్ని శిక్షిస్తారా ?
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ బంద్ వల్ల ప్రయోజనం లేదని, కేంద్రం తప్పు చేస్తే రాష్ట్రాన్ని శిక్షిస్తారా? అంటూ వ్యాఖ్యలు చేసారు. రాజీనామా చేసి రోడ్ల మీద తిరుగుతున్నా పట్టించుకోవటం లేదన్న అక్కసుతోనే బంద్ కు పిలుపునిచ్చారని, ఇలా చేస్తే రాష్ట్రానికి రావలసిన కంపెనీలు రాకుండా పోతాయని, ఉద్యోగావకాశాలు దెబ్బతింటాయని ఇంకా చాలా చెప్పారు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. 

బంద్ కు పిలుపునివ్వటం తప్పు 

తెలుగు దేశం పార్టీ, కేంద్రం రాష్ట్రాన్ని విభజిస్తే, నూతన ఆంధ్ర ప్రదేశ్ బంద్ కు పిలుపునివ్వలేదా? మద్దతు ఇవ్వలేదా? అప్పుడు ఈ నీతులు ఏమయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడే అందరికీ ఎక్కడ లేని నీతులు గుర్తొస్తాయి. పోనీ ఒకవేళ రేపు అధికారం కోల్పోతే రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా బంద్ లు చేయము అని హామీ ఏమైనా ఇవ్వగలరా? 

కేంద్రం తప్పుచేస్తే -  అని అన్నారు అంటే ఇది చేసిన తప్పు నుండి తప్పించుకు పోవటం 

అయితే కేంద్ర ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు భాగస్వామి అయి, మొన్నటి వరకు కేంద్ర మంత్రిపదవులు అనుభవించిన పార్టీకి కేంద్రం చేసిన తప్పులో అసలు భాగస్వామ్యమే లేకుండా పోతుందా? సులువుగా తప్పునంతా పక్కవారి మీద రుద్దేసి తనకేం సంబంధం లేదని మరోసారి నమ్మించే ప్రయత్నమే ఇది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బలి అయింది. కానీ ఇక్కడ బిజెపికి నష్టపోవటానికి ఏమీ లేదు. దీనితో బిజెపికి వైసిపి కి సంబంధం అంటగట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. గత ఎన్నికల సమయంలో వైసిపిని పిల్ల కాంగ్రెస్ అని అన్నారు. ఈ సారి బిజెపితో అంటారు. వారు ఎవరితో మాకు సంబంధం లేదు మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాం మొర్రో అని ఏడ్చినా,  అప్పుడూ-ఇప్పుడూ ఈ గోబెల్స్ ప్రచార ధోరణిలో మాత్రం ఏ మార్పూ లేదు. 

ఇంకా తెలుగు దేశం మంత్రులందరిదీ ఒకే పల్లవి. జగన్ మోడీని విమర్శించడం లేదు. జగన్ మోడీని విమర్శించడం వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమన్నా ఉందా? ఇక్కడ రాష్ట్రంలో కేవలం 2% ఓట్లు తక్కువ వచ్చిన ప్రధాన ప్రతిపక్షం వైసిపి. వారు విమర్శిస్తే మీరు విధాన నిర్ణయాలేమైనా తీసుకున్నారా? మార్చుకున్నారా? ఇన్నాళ్ల పాటు కేంద్రంలో అధికారం లో ఉన్నప్పుడు అఖిల పక్షం అని వైసిపి ఎంత మొత్తుకున్నా మీరెప్పుడైనా విన్నారా? ఇప్పుడు మాత్రం మీరు చేస్తున్న తప్పులో భాగస్వామ్యం కల్పించడానికి అఖిల పక్షాలు అని మళ్ళీ డ్రామాలు. ఇక్కడ మీరే ప్రధాన ప్రతిపక్షానికి ఇంత విలువ ఇస్తే కేంద్రంలో ఆకులో ఈకంత విలువ కూడా ఉండదు. జగన్ విమర్శిస్తే ఎంత? విమర్శించక పోతే ఎంత? నాలుగు సంవత్సరాలు పొత్తు పెట్టుకునేది మీరు, విమర్శించాల్సింది జగన్. ఇంత తెలివి గల ఆరోపణలు ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటాయా?

0/Post a Comment/Comments

Previous Post Next Post