తెలంగాణ అడుక్కోవడం లేదు

విభజన చట్టం అమలులో నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ఎంతో నష్టపోయిందని రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీ కేశవరావు అన్నారు. విభజన బిల్లులో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేక అంశాలున్నాయని ఆయన అన్నారు. 

విభజన బిల్లు ప్రకారం రాష్ట్రానికి రావలసిన విద్యుత్ ను ఆంధ్ర ప్రదేశ్ సరఫరా చేయలేదని, అయినా కేంద్రం ఏమీ చేయలేదని అన్నారు. పైగా ఖమ్మం జిల్లా లోని ఏడు మండలాలను ఆర్డినెన్సు ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో కలిపారని, అందులో సీలేరు విద్యుత్ కేంద్రాన్ని కూడా నష్టపోయిందని తెలియచేసారు. అయినా తాము అడుక్కోలేదనీ సమస్యలు పరిష్కరించుకున్నామని కూడా అన్నారు. 

పార్లమెంట్ సాక్షిగా చేసిన విభజన చట్టాన్ని అమలుపరచాలని కోరారు. ఇప్పటికీ తెలంగాణకు ప్రత్యేక హై కోర్టు లేదని, అడిగితే కేంద్ర మంత్రి నవ్వుతున్నారని ఆయన విమర్శించారు. కడప మరియు బయ్యారంలలో తక్షణమే స్టీలు ప్లాంట్లు మంజూరు చేయాలని అన్నారు. విభజన అనంతరం ఇంకా నీటి కేటాయింపులు జరపలేదని, దానితో నీటి విషయంలో తెలంగాణ నష్టపోతుందని కేశవరావు అన్నారు.  తెలంగాణకు ఇచ్చిన హామీల విషయంలో కూడా సానుభూతి చూపాలని ఆయన అన్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post