హైదరాబాద్ ను బిచ్చగాళ్లు లేని నగరం (Beggar Free City) గా మార్చే ప్రయత్నంలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 9,000 మంది బిచ్చగాళ్లను పట్టుకుని జైళ్ల శాఖకు అప్పగించారు. వీరిలో 300 మందిని పునరావాస కేంద్రానికి తరలించి వారికి విద్యావకాశాలు మరియు ఉపాధి కల్పిస్తున్నారు.
హైదరాబాద్ పోలీసులు నవంబర్ 2017 నుండి నగరంలో బిచ్చగాళ్లను పట్టుకోవటం ప్రారంభించారు. వీరికోసం విద్య, ఉపాధి శిక్షణ కార్యక్రమాలతో పాటు, శారీరకంగా స్వస్థతతో ఉన్నవారికి ఉద్యోగాలు కూడా కల్పించామని తెలంగాణ జైళ్ల శాఖ IG నరసింహయ్య తెలిపారు.
బిచ్చగాళ్లను పట్టుకున్న వెంటనే వారి వివరాలు సేకరించి, వారికి సంబంధించిన వారిని పిలిపించటం, కౌన్సిలింగ్ ఇవ్వటం వంటివి చేస్తున్నాము. ఒకవేళ తమ నివాసాలకు వెళ్ళడానికి వారు సుముఖత చూపితే మాత్రమే సంబంధించిన వారి హామీ తీసుకుని పంపిస్తున్నాము. చర్లపల్లి జైలులో మొగ యాచకులకోసం, చంచల్ గూడా జైలులో ఆడ యాచకుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
Post a Comment
Note: only a member of this blog may post a comment.