అమెరికాలో పనిచేసే విదేశీయులు ఎవరైనా సరే పది సంవత్సరాల కాలంపాటు సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ చెల్లిస్తేనే ఆ ప్రయోజనాలు పొందటానికి అర్హులు. ఇది అమెరికాలో సామాజిక ప్రయోజనాలు పొందటానికి ఆ దేశం విధించిన నిబంధన. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ అక్కడ విధిగా సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ చెల్లిస్తారు.
ఇక ఇంకో నిబంధన విషయానికి వస్తే హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై అమెరికాలో పనిచేసే విదేశీయులు, గరిష్టంగా 7 సంవత్సరాలకు మించి ఆ దేశంలో ఉండటానికి వీల్లేదు. ఎక్కడో తేడా కొడుతోంది కదా.. అవును ఈ రెండు నిబంధనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.
విదేశీయులు అక్కడ 7 సంవత్సరాల పాటు పనిచేసి అక్కడి ప్రభుత్వానికి, తమకు ఏ మాత్రం ఉపయోగం లేని సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ ను చెల్లిస్తున్నారు. ఒక్క భారతీయులే ఈ విధంగా నష్టపోయిన మొత్తం బిలియన్ల డాలర్లు ఉంటుందట. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖా సహాయమంత్రి సీఆర్ చౌధరి, వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.
Post a Comment