బ్యాంక్ ఆఫ్ చైనా ఇక ఇండియాలో

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు మన దేశంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన అనుమతులను జారీచేసింది. చైనాలో గత నెలలో జరిగిన షాంగై కోపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో మోడీ చైనా నాయకత్వానికి ఇచ్చిన హామీ మేరకు ఈ అనుమతులు జారీ చేసినట్లు సమాచారం. చైనా రక్షణ మంత్రి కూడా త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. 

106 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఇప్పటికే పాకిస్తాన్లో కార్యకలాపాలు ప్రారంభించింది. కరాచీలో గత సంవత్సరం ఒక శాఖను ఏర్పాటు చేసింది. ఇది మన దేశంలో కార్యకలాపాలకు అనుమతి పొందిన రెండవ చైనా బ్యాంకు. ఇప్పటికే మన దేశంలో చైనాకు చెందిన ఇండస్ట్రియల్ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్ ఆఫ్‌ చైనా లిమిటెడ్‌ ఉంది. ఇప్పటివరకు మనదేశంలో 45 ఇతర దేశాలకు చెందిన బ్యాంకులు పని చేస్తున్నాయి. 

0/Post a Comment/Comments