ఢిల్లీలో ప్రజా విజయం

ఢిల్లీలో ప్రజా విజయం
కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో కీలక విజయం సాధించినట్లయింది. ఢిల్లీలో పాలనపై ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, దీనిలో లెఫ్టనెంట్ గవర్నర్ జోక్యం చేసుకోజాలరని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తుది తీర్పు ప్రకారం లెఫ్టనెంట్ గవర్నర్ కు ఎటువంటి శాసన నిర్మాణ అధికారాలు ఉండవు. ప్రభుత్వంతో ఏవైనా అభిప్రాయం బేధాలు వస్తే రాష్ట్రపతి వద్ద పరిష్కరించుకోవాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి  గవర్నర్ కు సమాచారం ఇస్తే చాలని, వాటికీ ఆయన అనుమతి అవసరం లేదని పేర్కొంది. 

సుప్రీంకోర్టు తీర్పును ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. ఇది ఢిల్లీ ప్రజల విజయమని, ప్రజాస్వామ్యానికి కూడా గొప్ప విజయం అంటూ ఆయన ట్వీట్ చేసారు.

0/Post a Comment/Comments