ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాల వారి ర్యాంకులను, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (DIPP) విడుదల చేసింది. వాణిజ్య సంస్కరణలు, కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించినట్లు వెల్లడించారు. ఈ జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ తొలి స్థానంలో నిలవగా, తెలంగాణ రెండవ మరియు హర్యానా మూడవ స్థానాన్ని పొందాయి.
నిర్మాణ అనుమతి, కార్మిక నియంత్రణ, పర్యావరణం, సమాచార లభ్యత , భూమి లభ్యత మరియు సింగిల్ విండో అనుమతులు లాంటి అనేక విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించినట్లు తెలిపారు.
Post a Comment