చంద్రబాబు ఎంపీలతో టెలీ కాన్ఫరెన్సుల పేరిట కొన్ని పత్రికలలో వస్తున్న లీకులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇవాళ తాజాగా ఆయన ఎంపీలతో మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల చట్టం కేంద్రం వద్ద 9 నెలలుగా పెండింగ్‌లో ఉందని, రేజర్వేషన్లను 9వ షెడ్యూలులో చేర్చే అంశం పై వత్తిడి తేవాలని దిశా నిర్దేశం చేసారు. బిజెపి మోసాన్ని ఎండగట్టాలని, ఆ పార్టీ చెప్పేదొకటి, చేసేదొకటి అని అఫిడవిట్లతో తేలిపోయిందని అన్నారు. అలాగే జగన్ విషయంలో కాపు రిజర్వేషన్లపై, ఇంకా బిజెపి తో జగన్ అంటకాగుతున్నారని నిలదీయాలని పిలుపునిచ్చారు.
గత సంవత్సరం వరకు, ఎవరైనా బిజెపిని విమర్శిస్తే, వారి పైన ఇంతెత్తున ఎగిరిపడేవారు. బిజెపిని విమర్శిస్తే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని, కేంద్రంతో సఖ్యతగా లేకపోతే, పోరాడి ఏమీ సాధించలేమని అనేవారు. ఇప్పుడేమో పోరాడాలి, మేము తిడుతున్నాం కాబట్టి మీరు కూడా తిట్టాలి. మేము పొత్తు పెట్టుకుంటే అభివృద్ధి కోసం, మీదేమో పొత్తులేకపోయినా అంటకాగటం. ఇలా...
చంద్రబాబు ,మొన్నటి వరకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలోని సమస్యలన్నింటికీ మూల కారణంగా కాంగ్రెస్ పార్టీని అభివర్ణించేవారు. ఇప్పుడేమో పొత్తు పెట్టుకుంటామనే సూచనలు వస్తున్నాయి. గత ఎన్నికలలో వైసిపిని విజయవంతంగా పిల్ల కాంగ్రెస్ పేరిట కాంగ్రెస్ కు అంటగట్టారు. ఇప్పుడేమో బిజెపికి అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
చంద్రబాబే రెండు పార్టీలతో అంటకాగాడు, వైసిపికి అప్పుడూ పొత్తు లేదు. ఇప్పుడూ పొత్తు లేదు. ఇలా తెలుగు దేశం వాళ్ళు ఏమి చేస్తే అది మాత్రమే సరైనది, అందరూ చేసి తీరాల్సిందే మరి. లేకపోతే అది కుమ్మక్కు, లాలూచీ, అంటకాగటం అని తన తెలివి తేటలతో, మీడియా దన్నుతో నమ్మించగలరు మరి.
ఇక కాపు రిజర్వేషన్ల విషయానికొస్తే ఇస్తే కేంద్రం ఇవ్వాలి. జగన్ అయినా, చంద్రబాబు అయినా చేసేదేం లేదు. ఇద్దరిలో ఎవరైనా పోరాడో, బుజ్జగించో సాధించవలసిందే.
Post a Comment