కమీషన్ల సంస్కృతి కాంగ్రెస్ పార్టీదే

కమీషన్ల సంస్కృతి కాంగ్రెస్ పార్టీదే
సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి నూతన సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా తెలంగాణ, దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఐటీ, పురపాలక శాఖా మంత్రి కెటిఆర్ అన్నారు. సోమవారం ఆయన ఎల్లారెడ్డిపేట మండలంలో ₹ 1.39 కోట్ల ఖర్చుతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసారు. 

మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ పథకాల అమలు కోసం 43,000 కోట్ల రూపాయలను కేటాయించామని, రాష్ట్రంలో సుమారు 42 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నామని అన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు కూడా మంచి బియ్యాన్ని అందిస్తున్నామని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమాలతో బాలికల వివాహానికి 1,16,000 అందిస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను ప్రోత్సహించడానికి కెసిఆర్ కిట్లను అందచేస్తున్నామని ఆయన తెలియచేసారు. 

ఈ కార్యక్రమంలో మంత్రి తారక రామారావు గారితో పాటు టెస్కాబ్‌ ఛైర్మన్‌ రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మరియు ఇతరులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆగష్టు 15 నుండి తెలంగాణ రైతులకు భీమా కల్పిస్తున్న తొలి రాష్ట్రం అవనుందని కూడా తెలిపారు. అలాగే హరిదాసు నగర్ లో తెలంగాణ ఉద్యమ మృతులకు ఆయన 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. 

కాంగ్రెస్ పార్టీ పై కూడా మంత్రి విమర్శలు చేసారు. వారు కేంద్రంలో అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని, కానీ ఏ రాష్ట్రంలోనూ వారికీ 20 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం లేదని ఆయన అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఏ ఒక్క ఎన్నికలలో వారు గెలవలేదని, అయినా ఆ పార్టీ నాయకులు మారటం లేదని అన్నారు. సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని, పక్కన కర్ణాటకలో ఆ పార్టీ నాలుగు విడతల రుణమాఫీ చేసిందని, ఇక్కడ మాత్రం ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెపుతున్నారని ఆయన మండిపడ్డారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టులపై అనవసర అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, కమీషన్ల సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి అన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post