నటి, మోడల్ అలేఖ్య ఏంజెల్ వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డితో తీసుకున్న సెల్ఫీని ఉపయోగించి, పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుండటంతో ఆమె వాటిని ఖండించింది.
గత సంవత్సరం ఫిబ్రవరిలో ఒక సీడీ లాంచ్ చేసిన సందర్భంగా తన కుటుంబ సభ్యులతో జగన్ నివాసమైన లోటస్‌పాండ్‌కి వెళ్లి ఆయనను కలిసిన సందర్భంలోనే ఫొటోలు, సెల్ఫీలు దిగానని వివరణ ఇచ్చింది. ఆ ఫోటోలు ప్రమోషన్ కోసం అప్పట్లో తానే సోషల్ మీడియాలో పోస్టు చేసానని వాటిని పట్టుకొని రాద్ధాంతం చేయవద్దని కోరింది.
తాను కూడా పవన్ను అభిమానిస్తానని కానీ, ఈ దుష్ప్రచారం వల్ల తీవ్ర వేదనను అనుభవిస్తున్నానని, మీ ఇంట్లో వాళ్లకయితే ఇలాగే చేస్తారా అని మండిపడింది. జగన్ తనకు అన్న, తండ్రి లాంటి వారని, ఇటువంటి చర్యలు పవనిజానికే కాదు మానవతకు కూడా మంచివి కాదని పేర్కొంది.
Post a Comment