తిరుమల తిరుపతి దేవస్థానం పాలక ధర్మకర్తల మండలి ఆగస్టు 9వ తేదీ నుంచి 17 వరకు 9 రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని పూర్తిగా నిలిపి వేయాలని నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహాసంప్రోక్షణ సందర్భంగా ఆగమ పండితుల సలహాతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 11న అంకురార్పణ, 12వ తేదీ నుంచి 16 తేదీ వరకూ శ్రీవారి ఆలయంలో అష్ట బంధన బాలాలయ మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా 9వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కొండ పైకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించనున్నారు. ఆగమ శాస్త్ర ప్రకారం తీసుకున్న నిర్ణయం కాబట్టి భక్తులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు.
Post a Comment