తిరుమల వెంకన్నకు భూరి విరాళం

తిరుమల వెంకన్నకు భూరి విరాళం
తిరుమల శ్రీవారికి ఇద్దరు ప్రవాస భారతీయులు భారీ విరాళాన్ని అందించారు. అమెరికాలో ఫార్మా వ్యాపారం చేసే రవి ఐకా 10 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. మరొక భక్తుడు శ్రీనివాస 3.5 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. 

ఆంధ్రప్రదేశ్ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఈ విరాళాన్ని అందుకున్నారు. దేవస్థానం అధికారులు వీరిని సత్కరించి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో నగదు విరాళం అందుకోవటం ఇదే తొలిసారి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post