రైల్వే జోన్ సాధనకు నలుగురం చాలు

రైల్వే జోన్ సాధనకు నలుగురం చాలు
విశాఖలో బీచ్‌రోడ్‌లో నిర్వహించిన జన పోరాట సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనతో పాటు చంద్రబాబు, లోకేశ్‌, జగన్‌ కలిసి పోరాడితే విశాఖ రైల్వే జోన్‌ వస్తుందని అన్నారు. తనపై రైల్వే కేసులు పెట్టినా ఈ విషయంలో తాను నిలబడతానని, అందరూ కలసి పోరాడితే అదే వస్తుందని ఆయన అన్నారు. 

ఉత్తరాంధ్ర సమస్యలు తెలుసుకునేందుకు సైకిల్ యాత్ర చేయాలని లోకేష్ కు సూచించారు. అదేవిధంగా సైకిల్ పై ఢిల్లీకి వెళ్లి నిరసన తెలుపాలన్నారు. అధికార పార్టీ వారు చేసే దౌర్జన్యాలకు భయపడవద్దని, తానున్నానని జనసేన కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. 

జనసేన పార్టీ ఇవాళ ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం  విశాఖ బీచ్‌ రోడ్డులో నిరసన కవాతు నిర్వహించింది. దీనిలో పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ పాల్గొన్నారు. కాళీమాత ఆలయం నుంచి వుడా పార్కు వరకు ఈ కవాతు జరిగింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post