273 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్

273 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్
273 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనగానే ఏ దేశంలోనో అనుకుంటున్నారా? మన దేశం లోనే ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL),  GIC Re మరియు న్యూ ఇండియా అస్యూరెన్స్ (NIA) ల నుండి క్లెయిమ్ చేయనుంది. 

HAL, రష్యన్ లైసెన్స్ తో సుఖోయ్ యుద్ధ విమానాలను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ కంపెనీ తయారు చేసిన సుఖోయ్ -30 MKI  యుద్ధవిమానం, పరీక్ష జరుపుతున్నప్పుడు మహారాష్ట్ర లోని నాసిక్ లో కూలిపోయిన సంగతి తెలిసిందే. మనదేశంలో యుద్ధ విమానం కోసం భీమా క్లెయిమ్ చేయటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  

సాధారణంగా రక్షణ మరియు సైనిక ప్రాజెక్టులకు ఇన్సూరెన్స్ ఉండదు. అయితే ఈ భీమా HAL తయారు చేసి పరీక్షించే వరకే చెల్లుబాటవుతుంది. ఒకసారి విమానిక దళానికి విమానాన్ని అప్పగిస్తే ఇది చెల్లుబాటవదు. అయితే ఈ భీమా కంపెనీలకు HAL ఏటా 18-20 కోట్ల ప్రీమియం చెల్లిస్తూ వస్తుందట. ఒకసారి క్లెయిమ్ చేస్తే వచ్చే సంవత్సరం నుండి ప్రీమియం 20% పెరుగుతుంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post