కాళేశ్వరంపై దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

కాళేశ్వరంపై దాఖలైన పిటిషన్‌ కొట్టివేత
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై, తెలంగాణ ప్రభుత్వం రీ డిజైన్‌ పేరుతో భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని దాఖలైన పిటిషన్ ను సుప్రీమ్ కోర్ట్ కొట్టివేసింది. రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మి నారాయణ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై కోర్టు మాట్లాడుతూ హైకోర్టు ను ఆశ్రయించాలని సూచించింది. 

ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి భారీ ప్రాజెక్టులు నిర్మిస్తుందని, దీని వల్ల ఎక్కువ మంది నిర్వాసితులవుతారని, అవసరం లేకున్నా ఎక్కువ కెపాసిటీ తో రిజర్వాయర్లు నిర్మిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ప్రాజెక్టుకు ప్రత్యమ్నాయం కోసం నిపుణుల కమిటీ వేయాలని పిటిషన్లో కోరారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post