నరసరావుపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలో బహిరంగ సభ లో ప్రసంగించడానికి వెళుతుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
నరసరావుపేట, సత్తెనపల్లిలలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు చేసిన అవినీతిని బయట పెడతానని శ్రీనివాసరెడ్డి బహిరంగ సభ ఏర్పాటు చేసారు. సభ ఏర్పాటుకు అధికారుల అనుమతి లభించలేదు. అయినా ఏర్పాట్లు చేయటంతో ఉదయం నుండి ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. ఆయన అక్కడి నుండి ఎలాగోలా బయట పడి, సభ పరిసరాల్లోకి చేరుకోగానే ఆయనను అరెస్ట్ చేసారు.
కోడెల కుమారుడు శివరామకృష్ణ మూడు రోజుల పాటు చేసిన ధర్నాకు అనుమతి తీసుకోకున్నా స్పందించని పోలీసులు, ప్రతిపక్ష ఎమ్మెల్యేకు అనుమతి నిరాకరించి అరెస్టు చేయటం గమనార్హం.
Post a Comment