తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకూ వర్తింప చేయాలని వివిధ వర్గాల నుండి డిమాండ్లు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ డిమాండ్లపై స్పందించారు. ఆ డిమాండ్ అర్థరహితమైనదని, న్యాయ సమ్మతం కాదని వివరించారు. అసలు కౌలు రైతులను గుర్తించే వ్యవస్థ అంటూ ఏదీ లేదని, అసలు కౌలురైతులు ఎవరన్నది ఎవరూ స్పష్టంగా చెప్పజాలరని, ఏ రికార్డుల్లోనూ ప్రభుత్వం కౌలు రైతులను నమోదు చేసుకోలేదని ఆయన అన్నారు.
ఏ విధమైన యాజమాన్య హక్కు, ఆధారం లేనివారికి ప్రభుత్వ సాయం ఎలా అందిచగలుగుతాం? ఎవరికి పడితే వారికి డబ్బులు పంచిపెట్టడం వ్యవస్థలో సాధ్యం కాదని ముఖ్యమంత్రి వివరించారు. కౌలు రైతు పేరిట అసలు రైతుకు అన్యాయం చేయలేమని, భూమి ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందిస్తామని ఆయన స్పష్టంచేశారు.
Post a Comment