ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ పై గెలిచిన దక్షిణ కొరియా ఆటగాళ్లకు స్వదేశంలో చేదు అనుభవం ఎదురైంది. స్వదేశం చేరుకున్న ఆటగాళ్లకు అభిమానులు స్వాగతం పలికి, వారు ఫోటో సెషన్ కోసం సిద్ధం కాగానే గుడ్లు మరియు దిండ్లతో దాడి చేసారు. గ్రూప్ దశలోనే నిష్క్రమించిన జట్టుకు ఫొటోసెషన్ ఎందుకని మీడియా సిబ్బందిని సైతం అడ్డుకున్నారు.
జట్టు మేనేజర్ షిన్ మాట్లాడుతూ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తాము నాకౌట్‌కు చేరతామని భావించామని, కానీ అలా జరగలేదన్నారు. ఇంతవరకు అభిమానులు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.
Post a Comment