చిన్నవయసులో గ్రాండ్‌ మాస్టర్‌

మనదేశంలోనే అతి చిన్న వయసులో  గ్రాండ్‌ మాస్టర్‌గా చెన్నైకి చెందిన 12 ఏళ్ల ఆర్‌ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం అతని వయసు 12 సంవత్సరాల 10 నెలల 13 రోజులు. ఇటలీలో జరుగుతున్న గ్రెండైన్ ఓపెన్ చివరి రౌండ్ చేరుకునే  క్రమంలో అతను ఈ ఘనతను సాధించాడు.

ప్రపంచంలో అతి చిన్న వయసులో గ్రాండ్‌ మాస్టర్‌గా నిలిచిన ఘనత ప్రస్తుతం ఉక్రెయిన్‌కు చెందిన సెర్గీ కర్జాకిన్‌ పేరు  మీద ఉంది. 2002 లో కర్జాకిన్‌ 12 సంవత్సరాల 7 నెలల వయసులోనే ఈ ఘనతను సాధించాడు. కాగా ప్రజ్ఞానంద ప్రపంచంలో, చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయిన రెండవ వ్యక్తి.

2016 లో, ప్రజ్ఞానంద 10 సంవత్సరాల, 10 నెలలు మరియు 19 రోజులు ఉన్నప్పుడు అంతర్జాతీయ మాస్టర్ అయ్యారు. అది ఇప్పటికీ రికార్డే. కాగా ఇతనికి విశ్వనాథన్ ఆనంద్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

0/Post a Comment/Comments