ప్రముఖ నటుడు రానా వివరణ

ప్రముఖ నటుడు రానా, త్వ‌ర‌లో త‌న కుడి క‌న్ను ఆప‌రేష‌న్ చేయించుకోనున్నాడ‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. బ్ల‌డ్ ప్రెష‌ర్ వ‌ల‌న స‌ర్జరీ కొంత ఆల‌స్య‌మైంది. అయితే రానా ఆరోగ్యం బాగోలేదని, ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరగబోతుందంటూ  మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన తండ్రి సురేష్ బాబు ఖండించినా పత్రికలలో వార్తలు ఆగడం లేదు.

దీనికి రానా స్వయంగా తనే ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.

నా ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. నేను బాగానే ఉన్నా... కేవలం బీపీకి సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడుతున్నా. కొద్ది రోజుల్లో అంతా సెట్‌ అవుతుంది. మీ ప్రేమ అభిమానానికి కృతజ్ఞతలు. కానీ పుకార్లు సృష్టించకండి ఇది నా ఆరోగ్యం మీది కాదు. అంటూ ట్వీట్ చేసారు.

0/Post a Comment/Comments