వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం


ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే  డిమాండ్ తో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలు ఆమోదం పొందాయి.

ఏప్రిల్ 6వ తేదీన వైఎస్సార్‌ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మే 29న స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు తమ నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని, రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని చెప్పటంతో రాజీనామాలు ఆమోదం పొందినట్లు స్పీకర్‌ కార్యాలయం నుంచి ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాజీనామా చేసిన ఎంపీలు వరుసగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి మరియు  వైఎస్‌ అవినాష్‌రెడ్డి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post