ఇంటెల్ సిఈఓ రాజీనామా

ఇంటెల్ కార్పోరేషన్, గురువారం తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రియాన్ క్రజ్నిచ్ రాజీనామా చేశారని, ఇది తక్షణమే అమల్లోకి రానుందని  వెల్లడించింది. సంస్థ లోని మరో ఉద్యోగితో సంబంధం విషయంలో, ఆయన సంస్థ విధానాల్ని ఉల్లంఘించినట్లు విచారణలో వెల్లడైనందువల్ల ఆయన ఈ రాజీనామాను చేయవలసి వచ్చింది.

చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాబర్ట్ స్వాన్ ను బోర్డు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించింది. మే 2013 నుండి మిస్టర్ క్రజ్నిచ్ సిఈఓగా ఉన్నారు. అలాగే శాశ్వత CEO కోసం అన్వేషణను ప్రారంభించారు. దీనికోసం ఇంటెల్ ఉద్యోగుల పేర్లను, ఇంకా బయటి అభ్యర్థుల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.  

0/Post a Comment/Comments