ప్రపంచంలో ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్న ప్రజల సంఖ్యలో ఒక దశాబ్ద కాలం తర్వాత మొదటిసారిగా పెరుగుదల కనిపించింది. ఐక్యరాజ్యసమితి బుధవారం రోజు విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. పోషకాహార లోపంతో బాధ పడుతున్నవారు 2015లో 777 మిలియన్ల మంది ఉండగా, అది 2016 నాటికి 815 మిలియన్లకు చేరుకుంది.
ఐక్య రాజ్యసమితి యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2018 నివేదిక ప్రకారం, వివాదాలు, యుద్ధ వాతావరణం 18 దేశాలలో పోషకాహార లోపంతో ఉన్నవారి సంఖ్య పెరగటానికి కారణమయ్యాయి. కరువు, ప్రకృతి వైపరీత్యాలు కూడా దీనికి ఆజ్యం పోస్తున్నాయి. హింసాత్మక ఘర్షణలు కూడా 2017 లో రికార్డు స్థాయిలో 68.5 మిలియన్ల ప్రజలు వలస వెళ్ళడానికి కారణమయ్యాయి.
ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆర్ధిక నష్టాలు కూడా పెరిగాయి. 2017 లో దీనివల్ల 300 బిలియన్ డాలర్ల మేరకు ఆర్థిక నష్టాలు సంభవించాయని నివేదిక పేర్కొంది. ఇది ఇటీవల కాలంలో అత్యధికం. అమెరికా, కరేబియన్ దేశాలలో తుఫానులు పెను ప్రభావాన్ని చూపాయి.
దక్షిణాసియా లో (భారత దేశంతో కలిపి) బాల్య వివాహాలు 2000-17 కాలంలో 40% తగ్గుముఖం పట్టాయి. దాదాపు 70% మంచినీటి కొరత కనిపిస్తుంది. ప్రపంచంలో పట్టణాలలో నివసిస్తున్న ప్రతి 10 మందిలో 9 మంది కలుషితమైన గాలిని పీలుస్తున్నారు. దక్షిణాసియా లో పరిస్థితి మరింత ఘోరం. ఇక్కడ విద్యుత్, పారిశుద్ధ్య లోపాలు ఉన్నప్పటికీ, ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఘనణీయమైన ప్రయత్నాలే జరుగుతున్నాయి.
Post a Comment