వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. తెలంగాణ జనాభా రికార్డులలో నుండి పెద్ద సంఖ్యలో గ్రామాలు మాయమయ్యాయి.
2014 జూన్ లో తెలంగాణా ఏర్పాటు జరిగింది. 2016 అక్టోబరులో జిల్లాల పునర్వ్యవస్థీకరణ లో భాగంగా 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించారు. ఈ సమయంలో దాదాపు 450 గ్రామాలు తప్పిపోయాయి. ఇవన్నీ సరిహద్దు గ్రామాలు. అంటే పునర్వ్యవస్థీకరణలో ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు మారిన, ఒక మండలం నుండి మరొక మండలానికి మారిన గ్రామాలు. ఇవి జనాభా రికార్డులలో లేకుండా పోయాయి.
అయితే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసి 350 కి పైగా గ్రామాలకు సంబంధించిన సమాచారాన్ని పరిష్కరించింది, వాటి ప్రస్తుత స్థానాన్ని మరియు పేర్లను నిర్ధారిస్తూ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇంకా 70 గ్రామాలకు చేయవలసి ఉంది. ఈ గ్రామాలలో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎటువంటి ప్రభావం లేదని అధికారులు వివరించారు.
Post a Comment