ప్రముఖ సినీనటుడు రాజీవ్ కనకాల, సుమ దంపతులు రైతుబంధు చెక్కును వదులుకున్నారు. తాము ఆర్థికంగా నిలదొక్కుకున్నామని, ఇది తిరిగి రైతులకే ఉపయోగపడాలని ప్రభుత్వానికి వాపసు అందించారు.
రాజీవ్ కనకాల గారికి మహబూబ్‌నగర్ జిల్లాలోని హేమాజీపూర్ గ్రామంలో ఆయన పేరుమీద ఉన్న 7.10 ఎకరాల భూమికి 29,000 వేల రూపాయల చెక్కు వచ్చింది. ఆయన దానిని తహసీల్దార్ రాంబాయికి తిరిగిచ్చారు. ఈ సందర్భంగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ రైతుల కోసం రైతుబంధు బాగుందని కొనియాడారు. అలాగే ఇక్కడి ప్రభుత్వ స్కూలును కూడా సందర్శించారు.
Post a Comment