ప్రపంచ దేశాలన్నీ ఇరాన్ నుండి అన్ని రకాల చమురు దిగుమతులను నవంబర్ 4వ తేదీలోగా నిలిపివేయాలని అమెరికా హెచ్చరించింది. ఆ తర్వాత కూడా దిగుమతి చేసుకునే దేశాలపై, ఆ దేశ కంపెనీలపై తాము చర్యలు తీసుకుంటామని తెలిపింది. భారత్, చైనాలు దీనికి మినహాయింపు కాదని ప్రత్యేకంగా పేర్కొంది. దీనిని తాము భద్రతాపరమైన అంశంగా పరిగణిస్తున్నామని కూడా తెలిపింది.
ప్రస్తుతం మన దేశానికి చమురు ఎగుమతి చేస్తున్న దేశాలలో ఇరాక్, సౌదీ అరేబియాల తర్వాత ఇరాన్ మూడవ స్థానంలో ఉంది. గత నెలలో ఇరాన్ తో ఉన్న అణు ఒప్పందం నుండి అమెరికా వైదొలగి ఇరాన్ పై ఆంక్షలు విధించింది.
గతంలో కూడా అమెరికా ఇరాన్ పై ఈ విధమైన ఆంక్షలు విధించింది. అయితే భారత్, చైనాలు కొంతవరకు దిగుమతులు తగ్గించుకున్నాయి కానీ పూర్తిగా నిలిపివేయలేదు. మనదేశం గతంలో తాము కేవలం ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షలు విధిస్తే మాత్రమే పాటిస్తామని, దేశాలు వ్యక్తిగతంగా విధించే ఆంక్షలు పాటించలేమని తేల్చి చెప్పింది.
Post a Comment